Murudeswar Sri Murudeswara swamy temple :

God and Godess :

Sri Murudeswara swamy.

Location :

Murudeshwar Sri Murudeshwara Swamy Temple,
Murudeswar, Bhatkal Taluk,
Uttara kannada district-581350,
Karnataka.

Timings :

  • Morning 3.00 AM to 1.00 PM
  • Evening 3.00 PM to 8.00 PM

Temple History :

Murudeshwara Temple is situated 16 km from Bhatkal Taluk of Uttara Kannada district in the state of Karnataka, India.  Murudeshwara beach lies on the coast of the Arabian Sea.

The Murudeswar town was earlier known as ‘Mrideshwara’. It was later renamed as Murudeshwar after the construction of the temple. Murudeshwara is famous abode of Lord Shiva and a popular pilgrimage center in South India. According to the legend, Ravana brought the Atma Lingam from Mount Kailash. Lord Ganesha using his trick fooled Ravana on his way to Lanka and put down the Linga on the ground at Gokarna. Angered by this, Ravana tried to uproot and destroy the Linga. The broken pieces of the lingam were cast away. The covering cloth of the lingam fell at Kanduka Giri and the Murudeshwar temple was built at the site.

Murudeshwar is famous for the world’s second tallest Shiva statue (123 ft) & tallest temple tower (249 ft) of Murudeshwar Temple. The sea on three sides surrounds the temple towering on the small hill called Kanduka Giri. This is a great place to watch the sunset. Murudeshwar is also known for the Murudeshwar Fort and wonderful beaches.

The original Murudeshwar Temple at the site still exists and is believed to date back to the period of the epic Ramayana. The place has been mentioned in the epic as the place where Ravana, in a fit of rage threw the piece of cloth covering the Atma Linga of Lord Shiva.

As per the legends and mentions in the chapters of the epic Ramayana, Kaikesi who was the mother of Ravana worshiped Lord Shiva ardently. She used to make Lingas out of the beach sand and pray to them daily. However, every night the Linga used to get washed away by the sea. Seeing the distraught mother, Ravana promised to her that he will proceed to Mount Kailash and bring back Lord Shiva’s Atma Linga itself to her.

It is said that, Ravana once did a severe penance at Mount Kailash to please Lord Shiva. Shiva pleased with his worship agreed to bestow boons on him and asked Ravana what he wants. In return Ravana asked for Atma-Lingam. It is said that worshiping Atma-Lingam brings immortality. Shiva was so happy with Ravana that he granted him Atma-Lingam , But with a condition that he will not keep Atma-Linga on the ground till it reaches its final destination.

Ravan was happy and agreed to this condition. Taking the Atma-Linga along with him, He started back when on the way he found that it is getting dark and he needs to be perform his evening prayers. He saw a small boy playing and requested him to hold the Atma-Linga while is finishes his evening prayers.

The boy agreed but with a condition that if he finds it to be heavy and cannot hold further, he will call for him three times and if Ravana dosen’t come by that time, he will keep the Linga on the Floor. Ravana agreed to this condition and handed over the linga to the little boy. While he was busy with the prayers, the little boy started calling out Ravana, but Ravana did not want to leave the prayers in between. The boy called for his name three times and then kept the linga on the ground.

Ravan was very angry. He tried to lift the linga, but it did not come out. Ravana was so angry that he tried hitting the little boy and then the little boy came to his actual form and it was Lord Ganesha. Since Ravana has got Atma-Linga, this caused lot of worry to Devas, So they requested Lord Ganesha to help.

Murudeswar temple History in telugu :
మురుడేశ్వరం (లేదా) మృడేశ్వరం NH17 జాతీయ రహదారిలో కర్ణాటకరాష్ట్రంలోని ఉత్తర కన్నడజిల్లాలో బత్కల్‌ తాలూకాలో ఉంది. ఇక్కడికి కర్ణాటకలో ముఖ్య నగరాలైన బెంగుళూరు, మంగళూరు, హుబ్లీ, ధర్మస్థల మొదలయిన నగరాలనుండి బస్సులు, రైలుమార్గం కలవు. మురుడేశ్వరానికి కూడా ఉంది. కొంకొణ రైల్వేవిభాగంలో మురుడేశ్వరo రైల్వేస్టేషన్‌ ఉంది. గోకర్ణం నుంచి మురుడేశ్వరం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఆలయ చరిత్ర:

రావణాసురుడు కైలాసం నుండి పరమేశ్వరుడిని వేడుకుని తెచ్చిన ఆత్మలింగాన్ని గోకర్ణక్షేత్రంలో బ్రాహ్మణ రూపంలో వచ్చిన గణపతి భూమిమీద పెడతాడు. వెంటనే ఆత్మలింగం భూమినుండి బయటకి తీసుకురావడానికి వీలుకాకుండా భూస్థాపితమవుతుంది. సాయంసమయాన ఆర్ఘ్యాన్ని వదలడానికి వెళ్ళిన రావణాసురుడు భూమిలో నుండి బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా ఆత్మలింగం బయటకు రాదు. అప్పుడు రావణాసురుడు ఆగ్రహంతో ఆత్మలింగంపై ఉన్న వస్త్రం, దారం తదితర వస్తువులను విసిరిపారేస్తాడు. శివలింగాన్ని బలంతో ఎత్తే ప్రయత్నంలో ఆ శివలింగం ముక్కలు చేతికి వస్తాయి. ఆ ముక్కలను రావణాసురుడు కోపంతో విసురుతాడు. ఆ ఆత్మలింగం యొక్క ముక్కలు ఎక్కడెక్కడ పడ్డాయో, అక్కడ శివలింగాలు ఉద్భవించి, ఆప్రదేశాలు మహామహిమాన్వితమయిన పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.

ఆప్రదేశాలు, గోకర్ణక్షేత్రం దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వరాలు. గోకర్ణక్షేత్రంతో కలిపి ఈ క్షేత్రాలన్నీ పంచక్షేత్రాలుగా ప్రసిద్ధిచెందాయి. ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరివేస్తే, ఆ వస్త్రం పడిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశం మురుడేశ్వరం అయింది. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. అంటే సంతోషం అనే అర్థం కూడా వస్తుంది. అందరికీ సంతోషాన్ని ఇచ్చే దేవుడున్న ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రం మురుడేశ్వరం అయిందని కూడా అంటారు. దేవతలు ఈ ఐదుక్షేత్రాలను దర్శించి, అక్కడి శివలింగాలను పూజించారట. ఇక్కడికి దేవతలతో పాటు ఋషులు, మునులు కూడా వచ్చి పూజలు చేశారట.

మురుడేశ్వరంలో ఉద్భవించిన శివలింగానికి పానవట్టాన్ని తయారు చేయడానికి, దేవశిల్పి విశ్వకర్మను పరమేశ్వరుడు పిలిపించి అభ్యర్థించగా, విశ్వకర్మ పానవట్టాన్ని తయారుచేశారట. మురుడేశ్వరక్షేత్రం, కందూక పర్వతం మీద అరేబియా సముద్రతీరంలో ఉంది. ఈ పర్వతం బంతి మాదిరిగా (కందూకం= బంతి) ఉంది కాబట్టి, ఈ పర్వతానికి కందూక పర్వతం అనే పేరు వచ్చింది.

ఈ పంచక్షేత్రాలను దర్శించి పూజలు చేసిన వారి కోరికలన్నీ నెరవేరి, మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. మురుడేశ్వరస్వామికి, శివరాత్రినాడు, బిల్వపత్రంతో పూజలు చేసిన వారికి మరణభయం లేకుండా స్వర్గప్రవేశం కలుగుతుందని స్థల పురాణం తెలియజేస్తోంది. ఈ క్షేత్రానికి ఉత్తరాన భవానీదేవత, తూర్పున మహాదుర్గ దేవత, ఇతర దేవతలందరూ మిగతా దిక్కులలో కొలువైఉండి, రక్షిస్తున్నారట. బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుడేశ్వరుడిని పత్రాలు, పూలు, పండ్లతో పూజిస్తాడట.

బ్రహ్మదేవుడు ఇక్కడి పరమేశ్వరుడి విగ్రహంపై కమండలంతో చల్లిన నీళ్లతో కమండల తీర్థం అనే పవిత్ర సరస్సుగా ఏర్పడిందట. ఇక్కడ పాండవులు కొంతకాలం ఉన్నారట. అప్పుడు ధర్మరాజు, భీముడిని మురుడేశ్వరుడికి పవిత్ర గంగాజలంతో అభిషేకం చేయడానికి గంగాజలాన్ని వెంటనే తెమ్మన్నాడు. అప్పుడు పరమేశ్వరుడిని ధ్యానిస్తే గంగాజలం వెంటనే లభిస్తుందనుకున్న భీముడు పరమేశ్వరుడిని ధ్యానం చేసాడు. కానీ, పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. అప్పుడు భీముడు తన తలను భూమిమీద కొట్టుకున్నాడు. వెంటనే పరమశివుడు అనుగ్రహించి గంగామాతని హిమతీర్థంగా సృష్టించాడు. భీముడు తన నెత్తిని నేలపై కొట్టిన స్థలమే ప్రస్తుతం భీమతీర్థంగా పిలువబడుతోంది. బ్రహ్మహత్యా పాతకానికి శిక్షను తప్పించుకోవడానికి, ఇంద్రుడు స్వర్గాన్ని వదలి, మురుడేశ్వరానికి వచ్చి ఇక్కడ మురుడేశ్వరస్వామి అనుగ్రహానికి పాత్రుడు కావడానికి పూజలు చేశాడు.

ఇక్కడ ఇంద్రుడు ఉన్నప్పుడు, దేవతలందరూ వచ్చి మురుడేశ్వరస్వామిని పూజించారట. కోండమీద సముద్ర సమీపంలో ఉన్న మురుడేశ్వరస్వామి దేవాలయానికి సహజమైన సౌందర్యం, ఆకర్షణ ఉన్నాయి. దేవాలయ విశిష్టత: ఇక్కడికి దేశంలో అన్ని ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామికి పూజలు చేస్తూంటారు. స్వామిని దర్శించి పూజించడం వల్ల తమ కోరికలన్నీ తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. దేవాలయంలో అభిషేకాలు, కుంకుమ పూజలు మొదలయిన ఆరాధనలు జరుగుతాయి. అన్నసంతర్పణ సేవ, నిత్యసేవ, నందదీపసేవ, ఒక రోజు అన్నసంతర్పణం, శివరాత్రి ఉత్సవములు, పుష్యమాసంలో ఇక్కడ వైభవంగా జరుగుతాయి.

మురుడేశ్వర దేవాలయం, ఆధునిక కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, విశేషప్రతిభకు ఒక ప్రముఖ నిదర్శనం. ఎత్తైన దేవాలయాన్ని (18 అంతస్తులు) చూసినవారు, ఇటువంటి నిర్మాణం ఎలా సాధ్యమయిందని ఆశ్చర్యపోతారు. దేవాలయ పునర్నిర్మాణం పూర్తిగా విశిష్టమయిన పాలరాతితో జరిగింది. మురుడేశ్వర దేవాలయ ఆవరణలో కనబడే ఎత్తైన శివుని పాలరాతి విగ్రహం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఈ భారీ విగ్రహాన్ని నిర్మించడానికి సుమారు రెండు సంవత్సరాల సమయం పట్టింది. మురుడేశ్వర విగ్రహ ఆవిర్భావానికి సంబంధించిన కథలను తెలియజేసే శిల్పాలు, చిత్రాలు, ఆధునిక భారతదేశంలో అత్యుత్తమ శిల్పకళకు నిదర్శనాలు. ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. ప్రాచీనకాలం నాటి ఈ దేవాలయం కాల ప్రవాహంలో శిథిలావస్థకు చేరుకుంది. ఆ శిథిలావస్థ నుండి, అందరి ప్రశంసలను అభినందనలను అందుకునే స్థితికి రావడానికి ఆర్‌.ఎన్‌. శెట్టీ అనే భక్తుడు ముఖ్య కారకుడు.

అతని అకుంఠిత దీక్ష, భక్తి, పట్టుదల వల్ల ఈ మురుడేశ్వర దేవాలయ పునర్నిర్మాణం ఎంతో ఘనంగా జరిగింది. 20 అంతస్తులతో కూడిన ఆలయ గాలిగోపురం 249 అడుగుల ఎత్తుతో గంభీరంగా దర్శనమిస్తుంది. గాలి గోపురానికి ఇరుప్రక్కల ఏనుగు ప్రతిమలు నిజమయిన ఏనుగుల వలెనే భ్రమింపజేస్తుంటాయి. ఇప్పుడు ఈక్షేత్రం ప్రపంచంలోని వారందరినీ ఆకర్షిస్తుంది. అందుకే సంవత్సరమంతా రద్దిగా ఉంటుంది. మురుడేశ్వరంలో పవిత్రస్నానాలు చేయడానికి అనేక తీర్థాలున్నాయి. బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం, అందులో ముఖ్యమయినవి. ఈ తీర్థాలన్నీ దేవాలయం అవతల నగరంలో వున్నాయి. ఈ తీర్థాలలో, ఇక్కడి సముద్రంలో స్నానం చేయడం వల్ల, ధీర్ఘకాల రోగాలు నయమయి, తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

మురుడేశ్వర ఆలయ ప్రాకారంలోనే, ఇతర దేవతల చిన్న మందిరాలు ఉన్నాయి. వాటిలో గణపతి మందిరం, గౌరీమందిరం, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, అంజనేయ మందిరాలు ముఖ్యమయినవి. ఇక్కడ భక్తులు ప్రతిష్ఠించిన నాగప్రతిమలు కూడా ఉన్నాయి. దేవాలయ ఆవరణలో ధ్వజస్తంభం, నందిమండపం, యజ్ఞమండపం కూడా ఉన్నాయి. దేవాలయమ ప్రాంగణంలోనున్న రావిచెట్టు చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసి తమ కోరికలను నెరవేర్చమని, చెట్టుకు ముడుపులు కడుతూంటారు. చెట్టునిండుగా ముడుపులను చూడగలం. ఈ క్షెత్రంలో మురుడేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలో శనీశ్వర స్వామి ఆలయం కలదు. ఇక్కడ యాత్రీకులు ఉండడానికి వసతి గృహాలు, హోటళ్ళూ ఉన్నాయి. మురుడేశ్వరాలయం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ప్రతీ భారతీయుడు సందర్శించవలసిన పవిత్ర పుణ్యక్షేత్రం మురుడేశ్వరం.

Festivals :

Ticket price for rituals, darshanams & special sevas :

  • 1 Sarva Deva Pooja
  • 2 Shashwat Annsantarpana
  • 3 Annual Nityaseva Pooja
  • 4 Shashwat Nanda Deepa
  • 5 One Day Annasantarpana
  • 6 Ganahoma
  • 7 Kumbhabisheka
  • 8 Rudrabhisheka
  • 9 Panchambratha Abhisheka
  • 10 Kshirabhisheka
  • 11 Mangalarthi
  • 12 Laddu Prasada
  • 13 Panchakajjaya
  • 14 Co-conut- Set of 2
  • 15 Bilvarchane
  • 16 Thilarchane
  • 17 Chandanabhisheka
  • 18 Bhasmarchane
  • 19 Japa
  • 20 Shivasahasaranama
  • 21 Mrutyunjaya Manasa Pooje
  • 22 Thulabara (God’s Kanike)
  • 23 Pudi Prasada
  • 24 Flower Pooja
  • 25 Astotthara
  • 26 Ekadasha Rudra
  • 27 Shatharudra (God’s Kanike
  • 28 Sudarshana Japa
  • 29 Vadhu-Varara Parvesha
  • 30 Saptashanthi Parayana
  • 31 Lalithasahasranama Pooje
  • 32 Durga Sahasranama 
  • 33 Kunkumarchane
  • 34 Upanishath
  • 35 Ganapati Sahasranama
  • 36 Subramanya Sahasranama
  • 37 Anjaneya Sahasranama
  • 38 Navagraha Pooje
  • 39 Paduka Pooje
  • 40 Satyanarayan Kathe. Shanikathe (God’s Kanike)
  • 41 Vruthagalu
  • 42 Nagakallu Prasthiste (Place Kanike Only)
  • 43 Sarva deva pooja – Rs 20044
  • 44 Panchamritha Abhiseka – Rs 75

Nearest Temples Around Murudeswar Sri Mrudeswara swamy temple :

  • Gokarna Mahabaleswar temple – 78 km
  • Udupi Srikrishna mutt – 103 km
  • Sringeri Sri sharadamba temple – 155 km
  • Kollur Sri mookambika temple – 60 km
  • Anegudde Ganeha temple – 73 km

Nearest Bus Stations :

  • Murudeswar Bus stand
  • Honnavar Bus stand.

Nearest Railwaystations :

Murudeswar Railway station.

Nearest Airports :

  • Mangalore international airport
  • Bangalore international airport

Photos of the temple :